Monday, June 30, 2014

బతుకు నేర్పిన పాఠం .....

పంచుకుంటే పెరిగేది జ్ఞానం ... 
దాన్ని పంచకుంటే పెరిగేది అహాం .... 
పంచుకుంటే పెరిగేది సంతోషం .... 
దాన్ని పంచకుంటే మిగిలేది శోకం ..... 
పంచుకుంటే తరిగేది బాధ ..... 
దాన్ని పంచకుంటే పెరిగేది వేదన .... 
పంచుకుంటే పెరిగేది బంధం ...
దాన్ని తెంచుకుంటే మిగిలేది శూన్యం .... 
దాచుకుంటే దాగేది పరువు..... 
దాన్ని దాచకుంటే మిగిలేది గుండె బరువు .... 
దాచుకుంటే దాగలేనిది వలపు .... 
దాన్ని దాచుకుంటే కలుగును ఓ పెద్ద మలుపు ..... 
పిలవకున్న వచ్చేవి కష్టాలు ... 
ఆ కష్టాల్లో పిలిచినా రానివి చుట్టాలు ..... 
పిలవకున్న పలకరించేవి రుగ్మతలు ..... 
అవి వచ్చినప్పుడు పిలిచినా పలకనివి గుళ్ళో దేవవతలు ..... 
వెళ్ళిపోయినా ప్రేయసి పై తరగక రెప్ప చాటున దాగిన  ... ప్రేమ పాశం ..... 
రెప్ప పాటున చడి చప్పుడు చేయకుండా ... పోయే ఈ ప్రాణం ....
 అన్న నీకేందుకింకా అంత మమకారం ...?!?.... 
ఏమో ఆ దేవుడన్న విప్పగాలడా ఈ శేష ప్రశ్నల నీ జీవిత సారం ...?!?... 
ఇది ఇప్పడి వరకు నా బతుకులో ఒక మరణం , ఓ ఎడబాటు నేర్పిన పాఠం .....!!! 


1 comment:

  1. Thanks Ahmed for the info ....but i have not started my blog for publicity.......

    ReplyDelete