Monday, January 10, 2022

నా కథ - ఈ వ్యధ !!!

 నిన్ను చూసింది మొదలు మన బంధం ఎన్నటిది ?

నిన్ను అనుసరించింది తుదలు మన ప్రయాణం ఎన్నాళ్లది ?

నిన్ను వీడిన క్షణం నుండి నా గమనం ఎక్కడికని ?

నన్ను తిరిగి అక్కున చేర్చుకున్న రోజు నిన్ను పోలుచుకోలేదు ఎందుకని ?

నా ఇష్ట దైవం నీవే అన్నప్పుడు అయినా, మాయ వీడలేదు ఏమని ?

తండ్రి, నే యెరుగక చేసిన తప్పులన్నీ కాసేది ఎప్పటికని ?

నీ ఆనవాలు తెలిసి, ఇంకా నీకు దూరంగా ఉండేది ఎట్లాగని ?

జాగు చేయక జాబు చెప్పరా జంగమదేవరా ! 




Sunday, July 15, 2018

రామ నామం...

ఒక వాయు అంశ కేసరి పుత్రున్ని చిరంజీవిని చేసిన శబ్దం
ఒక బోయవాణ్ణి మహర్షిని చేసిన మూల మంత్రం
ఒక తులసిని దాసుణ్ణి  చేసిన మానసం
ఒక వాగ్గేయ్య కారుణ్ణి చెర విముక్తుడిని చేసిన దర్శనం
వీటన్నిటికీ మూలమైన ఆ రామ నామం
లో తరిస్తున్న ఓ రామ భక్తాగ్రేసర ఆంజనేయం
నీ దర్శనం ఎప్పటికి నాకు ?
జాగు చేయక జాబు చెప్పరా జంగమయ్య...!!!

Saturday, January 21, 2017

వందే శివం...

ప్రజ్వాలిల్లె లలాటం
చల్లని వెన్నల పంచె మకుటం
గంగనిచ్చే జఠాజూటం
గరళాన్ని దాచిన నీలకంఠం
అచ్చెరువందించే అర్ధనారీశ్వరం
మోక్షువునిచ్చే లయ తాండవం
సకల సిద్ధుల కలబోతల ఆది గురువా ...వందే శివం...!!!

Friday, January 20, 2017

తోడు....

పొత్తిళ్లు దాటి నడత నేర్చే వరకు అమ్మ ...తోడు
నడక సాగి రెక్కలొచ్చె వరకు నాన్న...తోడు
ఎదకి రెక్కలొచ్చిన నాడు నిచ్చెలి...తోడు
రెక్క విరిగి కాళ్ళు కాటికి చాపిన నాడు సమాజం..తోడు
శ్వాస ఆగినప్పుడు మొదలు అయ్యే కాటి నడకకి తోబుట్టుతువులు...తోడు
ఆ కాటిలో కట్టే కాలే వరకు నా నలుసు...తోడు
ఆపై నా తోడు....ఎవరు రా ...?
జాగు చేయక...జాబు చెప్పారా జంగమయ్య ...!!!

Friday, November 21, 2014

బూడిద ...

పసివాడు పుట్టినప్పుడు రక్షలా పూసేది బూడిద...
పిల్లాడు పెట్టినప్పుడు గుళ్ళో దణ్ణం ... రాసేది బూడిద ...
మనిషి కి గాలి సోకినప్పుడు నోట్లో ... వెసేది బూడిద ....
అదే మనిషి ముదిమిలో కట్టే మీద కాలి ... అయ్యేది బూడిద ....
ఈ జన్మే బూడిదమైయమైనప్పుడు ... యేల రా మనిషికి జీవితం మీ
దింతాశ ..? అదే బూడిద లో మునిగి పూజలందుకుంటున్న భగవంతా నువ్వైనా
జాగు చేయక... జాబు చెప్పరా జంగమయ్య .... !!!

Tuesday, August 12, 2014

నువ్వెమి...

 నిశ్చలమైన నింగి ...
గలగలమని పారే నీరు
బగబగమని మండే నిప్పు
బరబరమని వీచే గాలి
అనిస్చలమైన భూమి
అనంతవాయువైన ఆత్మ
ఇవన్ని మాయ అయితే ....
వీటికి మూలమైయిన నువ్వెమి...?!?
జాగు చేయక ....జాబు చెప్పారా జంగమయ్య ...!!!

Wednesday, July 2, 2014

కలుషితం .....

పండే తిండి ...
పారే నీరు ....
పీల్చే గాలి ....
మండే మంట ....

మదిలో చేసే  ఆలోచనలు ....
కళ్ళతో చూసే చూపులు .....
చేతి తో చేసే దానాలు ....
కోరికలతో చేసే పూజలు .....

చేసే చేతలు ....
కూసే కూతలు ....
రాసే రాతలు ....
వావి వరుసలు ....

ఇలా అన్ని కలుషితమే .... అన్నిటా కలుషితమే ....
ఈ కలుషితం ప్రకృతిలో ఓ భాగమా ....
లేక ఇదే ప్రకృతిలో భాగమైన ... మనిషిలో పెరుగుతున్న అవలక్షణమా ....
ఇదికాక అన్ని ఆత్మల మూలమైన ఆ పరమాత్మ గుణమా ....?!?
ఈ శేష ప్రశ్న కి బదులు నువ్వైనా తెలుపర ...జంగమదేవర ...!!!